ముళ్ళపదల్లో బాలుడు వదిలేసిన కసాయి తల్లి

Sep 1, 2025 - 07:09
Sep 1, 2025 - 18:47
 0  2
ముళ్ళపదల్లో బాలుడు వదిలేసిన కసాయి తల్లి

మునగాల 01 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి :  మానవత్వం మరిచి అప్పుడే పుట్టిన శిశువులను ముళ్లపొదలో పడేసి వెళ్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో మగ శిశువును రోడ్డు పక్కనే ఉన్న ముళ్లపొదల్లో స్థానికులు గుర్తించారు. రాను రాను జనాల్లో మానవత్వం మంట కలిసి పోతుంది. పదినెలలు మోసి.. ప్రాణాలకు తెగించి పురుడుపోసిన తల్లి.. కన్న పేగు బంధాన్ని తెంచుకుంటోంది.  కీతవారి గూడెం-మునగాల ప్రధాన రహదారి మధ్యలో ఉన్న తిమ్మారెడ్డి గూడెం గ్రామంలో రోడ్డు పక్కన ముళ్లపదలో అప్పుడే పుట్టిన శుభం మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. చిన్నారి అరుపులు విన్న అక్కడే ఆడుకుంటున్న కొందరి చిన్నారులు విని స్థానికులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు స్థానిక ఆర్ఎంపీతో ప్రధమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి దారుణానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలంటు స్ధానికులు పోలీసులను కోరారు. విషయం తెలుసుకున్న మునగాల ఎస్సై బి ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునీ విచారణ జరిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధ్యులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని అన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State