ఆశ వర్కర్లు అరెస్ట్

తిరుమలగిరి 01 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్
ఆశా వర్కర్లు తమ వేతనాన్ని 18 వేల రూపాయలు పెంచాలని కోరుతూ ,శాంతియుతంగా పోరాటం చేస్తున్న, ఆశా వర్కర్లను పోలీసులు అక్రమ అరెస్టులు, అమానుషమని ఆశా వర్కర్లు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పోలీసులు, ఆశా వర్కర్లను అక్రమంగా ముందస్తు అరెస్టు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గడచిన కొన్ని సంవత్సరాలుగా ఆశ వర్కర్లకు 18 వేల రూపాయల జీతం కావాలని ప్రభుత్వం పై, డిమాండ్ చేయగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కూడా వేతనాన్ని పెంచుతామని, ఎన్నికల్లో గెలిచి, నేటి వరకు కూడా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు డాక్టర్ల కంటే పనులు భారమైనప్పటికీ, కనీసం రోజుకు 500 రూపాయలు కూడా గిట్టకపోవడం దారుణమని అన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఆశా వర్కర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు పెంచే విధంగా కృషి చేయాలని వారు కోరారు. శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ పోలీసులు ఉదయమే వచ్చి, అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఆశ వర్కర్లు కొమ్ము విజయ మాసంపల్లి మాధవి బొబ్బల మహేశ్వరి వేముల ఏకలక్ష్మి చింతల శైలజ జంపాల స్వరూప తదితరులు పాల్గొన్నారు