స్థల ఎంపిక జాప్యం తో కలెక్టర్ వనమాస కార్యక్రమం రద్దు
తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ స్థల ఎంపిక జాప్యం తో కలెక్టర్ వనమాస కార్యక్రమం రద్దు మండల అధికారుల తీరుపై ఆగ్రహం... ఆత్మకూర్ ఎస్.. హరితహారం లో భాగంగా శ్రావణ వనమాస కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు జిల్లా కలెక్టర్ హాజరయ్యే కార్యక్రమానికి మండల అధికారులు స్థల సేకరణ ఎంపిక లో జరిగిన నిర్లక్ష్యం కారణంగా కలెక్టర్ కార్యక్రమం రద్దయింది. శ్రావణమాసం మొదటిరోజు బుధవారం జిల్లా కలెక్టర్ ఆత్మకూరు మండలంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు మండల స్థాయి అధికారులకు స్థల సేకరణ కార్యక్రమాన్ని అప్పగించారు. మండలపరిధి లో నీ ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ వెనుక భాగంలో మొక్కలు నాటేందుకు ఎంపిక చేశారు. ఆ స్థలంలో అప్పటికి కొన్ని మొక్కలు నాటి ఉన్నందున హడావుడి గా ఓ 50 గుంతలు తీసి పెట్టినట్లు ముందుగా వచ్చిన zp సీఈఓ అప్పారావు కలెక్టర్ కు సమాచారం ఇచ్చారు.విషయం తెలిసిన జిల్లా కలెక్టర్ మొక్కు బడిగా మొక్కలు నాటేందుకు కాదు వచ్చేది కనీసం 200మొక్కలు నాటాలని చెప్పినా మండల అధికారుల ఏర్పాట్ల నిర్లక్ష్యం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏపూర్ వచ్చే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. హరిత హారం కార్యక్రమం పట్ల మండల అధికారుల అలసత్వం పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపూర్ లో ఎంపీడీవో హసిం, తహసీల్దార్ వినోద్ కుమార్,meo థారాసింగ్,ao దివ్య,apo ఈశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.