చేనేత దుస్తులు ధరిద్దాం చేనేత కార్మికులను కాపాడుదాం .
జోగులాంబ గద్వాల7 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా చేనేత సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి * , *జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ . హాజరయ్యారు.
సీనియర్ చేనేత కార్మికులను ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ శాలువా ప్రశంసా పత్రం మెమొంటోతో ఘనంగా సత్కరించారు... జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత వస్త్రలతో వివిధ కళాశాల విద్యార్థి విద్యార్థి ఫ్యాషన్ షో నిర్వహించారు.
అదేవిధంగా ఫ్యాషన్ షో లో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా బహుమతులను అందజేశారు... జాతీయ చేనేత దినోత్సవ పురస్కరించుకొని వివిధ పాఠశాల లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు గెలుపొందిన వారికి ఎమ్మెల్యే ,కలెక్టర్ చేతుల మీద ప్రశంసా పత్రం , మెమొంటో అందజేశారు .
గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ...... చేనేత కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు.... తెలంగాణ రాష్ట్రంలో గద్వాల చేనేత కార్మికులకు పుట్టినిల్లు గద్వాల పేరు ప్రసిద్ధి చెందినది చేనేత కార్మికులచే గద్వాల అంటే చేనేత చీరలకు ప్రసిద్ధి చెందినదని ఎంతో ప్రాధాన్యత దక్కిందని తెలిపారు. ఏళ్ళుగా చేనేత కార్మికులు చేనేత వస్త్రాలను తయారు చేస్తూ చీరలను తయారు చేస్తూ వాటి తో ఎన్నో మంది వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేనేత కార్మికులకు అనేక రకాలమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా చేనేత కార్మికులకు అంతే ప్రాధాన్యత లభించే విధంగా కృషి చేస్తాము అదేవిధంగా గద్వాల హ్యాండ్లూమ్ పార్క్ ను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నిర్మాణం చేసి చేనేత కార్మికులకు అన్ని విధాలుగా అందుబాటులోకి వచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
గత పది నెలలుగా చేనేత కార్మికుల సంబంధించిన ట్రిప్ పండు రావడంలేదని చేనేత కార్మికులు తెలుపడం జరిగింది. వాటిని త్వరలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రతి ఒక్కరికి ట్రిప్పు పండు వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. గత ఎన్నికలలో చేనేత కార్మికులు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించడానికి సహకరించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ. ఈ ప్రభుత్వంలో కూడా చేనేత కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంచే విధంగా నా వంతు కృషి చేస్తాను అని అన్నారు.
భవిష్యత్తులో కూడా గద్వాలలో చేనేత కార్మికులు ఇచ్చే తయారుచేసిన చీరలను ప్రపంచ ప్రసిద్ధి చెందిన గా నా వంతు కృషి చేస్తాను నేటి యువత చేనేత వస్త్రాలను ధరించాలి ప్రతి ఒక్క చేనేత కార్మికులకు అండగా నిలిచాలని కోరారు. చేనేత కార్మికులుగా పనిచేస్తున్న వారు మీలోని నైపుణ్యతను మీ యొక్క ప్రతిభను భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ ప్రభుత్వంలో కూడా చేనేత కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి సహకారంతో నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇటీవలే రైలు ప్రమాదంలో మరణించిన చేనేత కార్మికులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. చేయి చేయి కలుపుదాం చేనేత కార్మికులను కాపాడుదాం..
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..... గద్వాల అంటే చేనేత కార్మికుల చే ప్రసిద్ధి చెందిన పట్టు చీరల పేరుగా గుర్తింపు పొందడం జరిగింది. నేను గద్వాలకు వచ్చిన వెంటనే కర్ణాటక మహారాష్ట్ర వంటి ప్రాంతాలలోని మా బంధువులు గద్వాల పట్టు చీరలకు ప్రసిద్ధి అని తెలపడం జరిగింది. నేటి యువత భవిష్యత్తులో కూడా చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలి అదేవిధంగా చేనేత కార్మికులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం ఫ్లిప్కార్ట్, అమెజాన్, వంటి వ్యాపార సంస్థలు కూడా గద్వాలలో తయారుచేసిన చేనేత వస్త్రాలు పట్టుచీరలు అమ్మే విధంగా ప్రభుత్వం తరఫున మాట్లాడి భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లో కూడా గద్వాలలో తయారుచేసిన వస్త్రాలను కొనుగోలు చేసే విధంగా వాటి ప్రాధాన్యత పెంచే విధంగా కృషి చేస్తామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలి చేనేత కార్మికులను కాపాడాలని కోరారు...
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ లోకల్ బాడీ కలెక్టర్ , జిల్లా చేనేత అధికారి గోవిందు, మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్, కౌన్సిలర్స్ నరహరి శ్రీనివాసులు, సాయి శ్యామ్ రెడ్డి, రామకృష్ణ శెట్టి, రిజ్వాన్, చేనేత కార్మికుల సంఘం అధ్యక్షులు రామలింగేశ్వర్ నాయకులు jకురుమన్న, అజయ్, ఫయాజ్, పూడూరు చిన్నయ్య, వివిధ శాఖల అధికారులు , చేనేత కార్మికులు,