సోషల్ మీడియా, ఇంటర్నెట్ కు బానిసలు కావద్దు
షీ టీం SI నీలిమ
మహిళా, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం
టేకుమట్ల ప్రభుత్వ పాఠశాలలో మహిళా, విద్యార్థుల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా షీ టీమ్స్.
సూర్యాపేట రూరల్. 13 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి: జిల్లా ఎస్పి కె నరసింహ ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి టేకుమట్ల గ్రామ ప్రభుత్వ పాఠశాల నందు జిల్లా షీ టీం అధ్వర్యంలో విద్యార్థుల భద్రత, మహిళా భద్రత, చట్టాల అమలు గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా షీ టీం SI నీలిమ మాట్లాడుతూ మహిళల, విద్యార్థుల రక్షణకు జిల్లా పోలీసు శాఖ కృషి చేసున్నది, ఎస్పి ఆదేశాల షీ టీం అధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల రక్షణకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్నారు. విద్యార్థులు మంచి అలవాట్లు కలిగి ఉండాలని, గురువులను, తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలని అన్నారు.
పూర్వకాలం నుండి సమాజంలో స్త్రీ కి ప్రత్యేక స్థానం ఉన్నది, మనకు జన్మని ఇచ్చినది ఒక స్త్రీ అనే విషయాన్ని గుర్తుంచుకుని స్త్రీ కి ప్రాముఖ్యత ఇవ్వాలని, గౌరవించాలని అన్నారు. మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మహిళా, విద్యార్థుల భద్రతలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయి అన్నారు. తోటి విద్యార్థులతో మంచిగా ప్రవర్తించాలి, కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, తల్లిదండ్రులకు గురువులకు సొంత గ్రామానికి మంచి పేరు తేవాలని అన్నారు. ఆదర్శంగా ఉండాలి. ఇంటర్నెట్ ద్వారా మంచిని నేర్చుకోవాలి కానీ సోషల్ మీడియా, ఇంటర్నెట్ కు బానిసలు కావద్దు అని విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్ పేయింగ్ గేమ్స్ అడవద్దు, సైబర్ మోసాల బారిన పడకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పిల్లలపై ఉన్నది అన్నారు.
వేధింపులపై నిర్భయంగా పిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ సలహా బేగం, రూరల్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రహిముద్దీన్, కానిస్టేబుల్ రవి హోమ్ గార్డ్ మజీద్, పోలీస్ కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య, గోపయ్య, చారి, గురులింగం, కృష్ణ నాగార్జున విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.