సోమవారం నుండి ప్రజావాణి కార్యక్రమం
జోగులాంబ గద్వాల 21 డిసెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల సోమవారం నుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున తాత్కాలికంగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపియడం జరిగిందని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమము యధావిధిగా నిర్వహిం చడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరములో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.