సైన్స్ ఫెయిర్ తో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది

Feb 28, 2025 - 17:49
Feb 28, 2025 - 17:51
 0  3
సైన్స్ ఫెయిర్ తో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది

సూర్యాపేట టౌన్

సైన్స్ ఫెయిర్ తో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని సాహితి హై స్కూల్ ప్రిన్సిపాల్ తీగల ఉపేందర్ రావు అన్నారు. శుక్రవారం జాతీయ సైన్స్ డే పురస్కరించుకొని పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువులతోపాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి ఆ దిశగా ప్రోత్సహించేలా తల్లిదండ్రులు కృషి చేయాలని సూచించారు. సమాజ నిర్మాతలు విద్యార్థులని, ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించేలా విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రదర్శనలు పలువురిని ఆకర్షించాయి. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కాళిదాస్ ,సురేష్ కుమార్, దయాకర్ ,రాజశేఖర్, శంకర్,రామకృష్ణ ,గాయత్రి ,ఝాన్సీ, మాధవి, విజయ, తహసిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333