సురవరం ఆస్తి మొత్తం ప్రజలకే

అడ్డగూడూరు 03 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– భారత పార్టీ దివంగత కమ్యూనిస్టు నేత సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబం మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. వారి మొత్తం ఆస్తిని ప్రజలకు పంచేస్తున్నట్లు సుధాకర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి ప్రకటించారు. సురవరం బతికున్నప్పుడు ప్రజల కోసమే పనిచేశారు. చనిపోయిన తర్వాత తన దేహాన్ని వైద్య పరీక్షల కోసం విద్యార్థుల ఇచ్చారు. ఇప్పుడు తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తి, నాలుగున్నర ఎకరాల భూమిని ప్రజా-యువజన అవసరాల కోసం ఇవ్వడం చాలా ఆదర్శవంతమైన పని అని కమ్యూనిస్టు నేతలు కొనియాడుతున్నారు.