సుప్రియ పిళ్ళై స్ కిచెన్ గ్రాండ్ ఓపెనింగ్
1.ప్రారంభించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.
హైదరాబాద్;29 జనవరి 2026 గురువారం తెలంగాణ వార్త రిపోర్టర్:- సినీ నటి, మిస్ ఇండియా సౌత్ విన్నర్, సోషల్ వర్కర్ అండ్ ఫౌండర్ సుప్రియ పిళ్ళైఏర్పాటు చేసిన సుప్రియ పిళ్ళైస్ కిచెన్ గ్రాండ్ ప్రారంభోత్సవం చైతన్యపురి లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై కిచెన్ గ్రాండ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విశిష్ట అతిధులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త , చైతన్యపురి కార్పొరేటర్ రంగ నర్సింహా గుప్త , సీనియర్ కాంగ్రెస్ లీడర్ మందుల సూర్య కిరణ్ ,గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ జైపాల్ రెడ్డి , బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పగిండ్ల శ్రీనివాస్ రెడ్డి , భవాని ప్రవీణ్ కుమార్ ,యాద శంకర్, తోట మహేష్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, ఒగ్గు బీరప్ప, రవి ముదిరాజ్, బొగ్గారపు శరత్ చంద్ర , బొగ్గారపు వరుణ్ , కిచెన్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా భోజన సదుపాయాల ఏర్పాటు ప్రజలకు మరింత చెరువుగా అయ్యిందని , అలాగే ఎల్బీనగర్ , దిల్సుఖ్ నగర్ , కొత్తపేట దగ్గరలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సుప్రియ పిళ్ళైస్ కిచెన్ ద్వారా మంచి నాణ్యతతో కూడిన భోజనం , 4ఏఎం బిర్యానీ సదుపాయాలు కల్పించి తక్కువ ధరలతో అందించడం చాల సంతోషకరమని అన్నారు. అలాగే ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ , చైతన్యపురి కార్పొరేటర్ రంగ నర్సింహా గుప్త మాట్లాడుతూ నిత్యం రద్దీ గల ప్రాంతం , వ్యాపారులకు , చిరువ్యాపారస్తులకు, కార్మికులకు, వివిధ రకాల అయిన ప్రజలకు మంచి నాణ్యతతో కూడిన భోజనం అందించడం అది కూడా తక్కువ రేట్లకే అందించడం చాల గొప్ప విషయం అని అన్నారు. నూతనంగా ప్రారంభించిన సుప్రియ పిళ్ళైస్ కిచెన్ గ్రాండ్ మరింతగా అభివృద్ధి చెందాలని వారికి పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. 4ఏఎం బిర్యానీ, వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ అలాగే విభిన్న రకాల రుచులతో ప్రత్యేకమైన ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుందని సుప్రియ పిళ్ళైస్ కిచెన్ గ్రాండ్ నిర్వాహకురాలు సుప్రియ పిళ్ళైస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు కంటెంట్ క్రియేటర్, కో ఫౌండర్ రాజా పిళ్ళై, ఫిలిం యాక్టర్, కో ఫౌండర్ కానుకుంట్ల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.