సుంకులమ్మ,ఈదమ్మ అవ్వ దేవతలను దర్శించుకున్న..

జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ...
మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్...
జోగులాంబ గద్వాల 22 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. పట్టణంలోని సుంకులమ్మ,ఈదమ్మ దేవతలను జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ... మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏరువాక పౌర్ణమి సందర్భంగా దర్శించుకున్నారు....అనంతరం వారు మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి అన్నదాత పండుగ నాగరికత ఎంత ముందుకు సాగిన నాగలి లేనిదే పని లేదని, రైతు లేనిదేపూట గడవదని అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండగే ఏరువాక పౌర్ణమన్నారు...విస్తారమైన వర్షాలతో నదులన్నీ నిండి పంట భూములు సిరిసంపదలతో రైతన్నల ఇంట పండుగ వాతావరణం వెదజల్లేందుకు సుంకులమ్మ,ఈదమ్మ దేవతల ఆకాంక్షించారు....నడిగడ్డ రైతులందరికి ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు....
వీరి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ బాబు,లత్తిపురం వెంకట్రామిరెడ్డి, శెట్టి ఆత్మకూరు లక్ష్మణ్,కౌన్సిలర్లు టి.శ్రీనివాసులు, మహేష్, పులిపాటి వెంకటేష్, డిటిడిసి నర్సింహులు, నాగేంద్ర యాదవ్, జనార్థన్, భాస్కర్ యాదవ్, తుమ్మల నర్సింహులు, నంబర్ నర్సింహులు, కొటేష్, సి.వై అనిల్, రంజిత్, మద్దిలేట్టి, శివ శంకర్, కుమారి నారాయణ,పెద్దపల్లి శివ, బిల్డర్ రామకృష్ణ, రాము యాదవ్, సామి, తదితరులు ఉన్నారు.