సీనియర్ సిటిజన్ గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మార్వో శేషగిరిరావు,ఎస్సై నాగరాజు

సీనియర్ సిటిజన్ గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మార్వో శేషగిరిరావు,ఎస్సై నాగరాజు

Apr 26, 2025 - 03:27
Apr 26, 2025 - 03:29
 0  12
సీనియర్ సిటిజన్ గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మార్వో శేషగిరిరావు,ఎస్సై నాగరాజు
సీనియర్ సిటిజన్ గోడ పత్రికలను ఆవిష్కరించిన ఎమ్మార్వో శేషగిరిరావు,ఎస్సై నాగరాజు

 అడ్డగూడూరు 25 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- వృద్ధులకు అవగాహన కల్పించిన సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సభ్యులు యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్, అడ్డగూడూరు మండలశాఖ ఆధ్వర్యంలో వయోవృద్దుల సంక్షేమ చట్టం & నియమావలికి సంబందించిన ఫ్లెక్సీ, గోడపత్రిక పోస్టర్, తహశీల్దార్ శేషగిరిరావు చేతులమీదుగా కార్యాలయంలో, పోలీసు స్టేషన్ లో ఎస్ ఐ నాగరాజు చేతులమీదుగా కరపత్రాల ఆవిష్కరణ జరిగింది. వారీ కార్యాలయంలో గోడపత్రికలు అంటించి, ప్లేక్స్ లు ఏర్పాటు చేశారు. లక్ష్మీదేవికాల్వ, గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో అతికించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మండలశాఖ అధ్యక్షులు కానుగుల రాము మాట్లాడుతూ.. తల్లిదండ్రులకు తమ పిల్లలే పోషణ కల్పించి ఎలాంటి ఇబ్బందులు బాధలు రాకుండా చూసుకోవాలని వారు అన్నారు. వృద్ధాశ్రమంలో చేర్పించవద్దని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సీనియర్ సిటిజన్ మండల అధ్యక్షుడు కానుగుల రాము, కార్యదర్శి బైరెడ్డి రాంరెడ్డి,సభ్యులు కొలుగూరి రాములు, బండి యాదగిరి, కంచుగట్ల వీరయ్య, గండమాల సాయిలు, కోరేపు సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.