సీతారాం ఏచూరి మరణం పీడిత ప్రజలకు తీరని లోటు

సీతారాం ఏచూరి మరణం పీడిత ప్రజలకు తీరని లోటు
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు
పేదల కోసం పేద ప్రజల కోసం ఏచూరి అందించిన సహకారం మరువలేనిది. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు అన్నారు
స్థానిక కోదాడ పట్టణంసిపిఎం కార్యాలయంలో పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలవేసి జోహార్లు అర్పించడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1952 ఆగస్టు 12వ తేదీన జన్మించి హైదరాబాదులో ఆల్ సెయింట్స్ హై స్కూల్లో మెట్రికేషన్ చేసి పై చదువుల కోసం జేఎన్టీయూలో చేరి తర్వాత ఆయన కమ్యూనిస్టు భావాల వైపు ఆకర్షితులై విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ లో చేరారని నాట్ నుండి చనిపోయేంతవరకు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసి తన తుది శ్వాస విడిచే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీలో పని చేశారని వారు అన్నారు పీడిత ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని వెచ్చించి దేశ రాజకీయాల్లో వామపక్ష నేతగా అత్యంత కీలక పాత్ర పోషించిన సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారి మరణించడం అత్యంత బాధాకరమైన విషయం.ఆయన మృతి పీడిత ప్రజలందరికి తీరని లోటుగా మిగిల్చిందని వారన్నారు.
రాజకీయాల్లో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి దేశాన్ని ప్రభావితం చేసే నాయకుడిగా నిలిచారు.మేధావిగా,ఆర్థికవేత్తగా, వక్తగా,రాజకీయ విశ్లేషకుడిగా,రాజ్యసభ సభ్యుడిగా నిరంతరం పేద ప్రజల పక్షం వహించారు.
తెలుగు వారైన ఏచూరి, ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు జాతీయ ప్రధాన కార్యదర్శిలుగా ఉండడం ఉద్యమానికి మరింత బలం చేకూరింది.ఒకనాడు ఏక కాలంలో తెలుగు వారైన పుచ్చలపల్లి సుందరయ్య , ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించి పేద ప్రజల పక్షాన ఎలా నిలిచారో జాతీయ రాజకీయాల్లో తెలుగు ప్రజల గౌరవం మరింత పెంచారు.వామపక్ష నేతగా జాతీయ రాజకీయాల్లో పీడిత, తాడిత ప్రజల గొంతుక నిలబడిన ఏచూరి కి యావత్ ప్రజానీకం నీరాజాలం పడుతుంది. దేశంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కూడా ఆయన పలువురిన మన్నలను అందుకునే నేతగా నిలిచారని అత్యుత్తమ పార్లమెంటేరియన్ గా ఖ్యాతి దక్కించుకున్న ఏ చూరి మరణం ఆల్ ఇండియా పార్టీకి కుటుంబానికి తీరంలోటని భావిస్తున్నామని వారు అన్నారు. వారు చనిపోయిన వారి ఆశయాలు చనిపోలేదని వారి ఆశయ సాధన కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త పనిచేస్తారని వారన్నారు వారికి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేయడం జరిగిందని వారు అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు జుట్టు కొండ బసవయ్య. సిపిఎం సీనియర్ నాయకులు డాక్టర్ సూర్య నారాయణ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి అనంతగిరి మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ పార్టీ టౌన్ కమిటీ సభ్యులు కుక్కడపు నళిని. దాసరి శ్రీనివాస్ కర్ణకోటి నవీన్ శాఖ కార్యదర్శి లు సిహెచ్ భీమయ్య జి మరియన్న గంట నాగరాజు ఎన్ పాపాచారి భూ చక్రం వెంకన్న ఇడుపుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.