సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం మాజీ పి.ఎ.సి.ఎస్ చైర్మన్ హనుమంతరావు

అడ్డగూడూరు 11జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్పవరం లాంటిదని అడ్డగూడూరు మాజీ సింగిల్ విండో చైర్మన్ చిత్తలూరి హనుమంతరావు అన్నారు. అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూరు గ్రామానికి చెందిన శీల అయిలమల్లుకు మంజూరైన 37 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మాజీ పి.ఎ.సి.ఎస్ చైర్మన్ చిత్తలూరి హనుమంతరావు అందజేశారు. ఇటీవల యాక్సిడెంట్ల గాయపడిన బాధితుడు శీల ఐలమల్లు మాట్లాడుతూ నన్ను ఆదుకున్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుకు కృతజ్ఞతలు తెలియజేశారు.మాజీ పీ.ఎ.సి.ఎస్ చైర్మన్ చిత్తలూరి హనుమంతరావుకు మరియు కాంగ్రెస్ అధ్యక్షునికి కాంగ్రెస్ కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు చిత్తలూరి సోమనారాయణ, చిత్తలూరి అర్వపల్లి,ఖమ్మంపాటి ఐలయ్య,శీలం మల్లయ్య, దర్శనాల యాదగిరి,కూటికంటి సోమయ్య చిత్తలూరి లింగయ్య, దర్శనాల,నాగయ్య శీల ఆవులేను,చిత్తలూరి సుధాకర్, చిత్తలూరి సోమ నరసయ్య, కూటికంటి రమేష్ ,చిత్తలూరి అశోక్, శీల లింగమలు శీల కృష్ణమూర్తి,చిత్తలూరి సైదులు, చిత్తలూరి రాము కొడారి ఉపేందర్, చిత్తలూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు.