సర్పంచ్ ని సన్మానించిన డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్
కట్టంగూర్ 23 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా కట్టంగూర్ మండల నూతన సర్పంచ్ గా ఎన్నికైన ముక్కాముల శ్యామల శేఖర్ దంపతులను బుధవారం ప్రముఖ సంఘ సేవకులు,పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని తుడిమిడి గ్రామానికి చెందిన డాక్టర్" ఆలేటి శ్రీనివాస్ గౌడ్ ఎంతోమంది నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలను అందిస్తూ,ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు.ఆయా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాల నిర్వహించడంతో పాటు,నిరుపేదలకు ఉచిత వైద్య సేవలను అందిస్తూ..ఈ ప్రాంత వాసిగా మంచి గుర్తింపును పొందారు.ఈ కార్యక్రమంలో కట్టంగూరు పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్,మాజీ సింగిల్ విండో డైరెక్టర్ నిమ్మల సత్యనారాయణ, గ్రామపంచాయతీ సిబ్బంది, ఎరుకల సత్తయ్య తదితరులున్నారు.