సరదాగా సరసులో (Reservoir )
స్నేహం ఎంత బలమైనది
సెంటిమెంట్ ఎంతో బలహీనమైనది, బలిదానాలకు
సిద్దపడుతుంది
సెలవులోచ్చాయని
సరదాగా గడపాలని
సంతోషంగా విహార యాత్రలని
సరసుకు పోతే
నీటిని తాకిన
దాని ప్రవాహన్ని చూసిన
హృదయం ఉరకలేస్తుంది
ఈత కొట్టాలనిపిస్తుంది
నీటిలోతు తెలువదు
ప్రవాహవేగం గమనించరు
జలచేరాలు ఏమున్నాయో
హెచ్చరిక ఏముందో చూడరు
ఒకరిని చూసి ఒకరు
ఈత రాకున్ననీటిలో దిగుతారు
ఈదుతూ తిరుగుతారు
మునిగి ప్రాణాలు కోల్పోతారు
ఇంట్లో విషయం చెప్పరు
బండ్లు తీసుకొని
బజారుకని వెలుతారు
శవమై కనిపిస్తారు, కుటుంబలో విశాదాన్ని నింపుతారు
మునిగి, కొట్టుక పోయేవారిని
స్నేహం, సెంటిమెంట్ తొ
కాపాడాలనే ప్రయత్నం చివరకు
కలిసి కాటికి చేరుతారు
యువత గమనించాలి
పరిస్థితులను అవగాహన చేసుకోవాలి, శిక్షకుల సమక్షంలో
అటువంటి సహాసం చేయాలి
చెప్పిన వినిపించుకోవాలి
సరదాలకు హద్దులుండాలి
స్నేహానికి విలువనివ్వాలి
సెంటిమెంట్ తొ బ్రతుకు
ఆగం కాకుండా చూసుకోవాలి.
రచన.
కడెం ధనంజయ
చిత్తలూర్.