సంక్రాంతి పండుగ సందర్భంగా కల్లూరు గ్రామంలో కబడ్డీ.. ముగ్గుల పోటీలు

చలసాని రాజీవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు... కబడ్డీ పోటీలకు సహకారం

Jan 11, 2025 - 17:58
Jan 11, 2025 - 18:29
 0  28
సంక్రాంతి పండుగ సందర్భంగా కల్లూరు గ్రామంలో కబడ్డీ.. ముగ్గుల పోటీలు

ఆటల పోటీలు ప్రారంభించడానికి

నేడు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రాక 

చలసాని ఫౌండేషన్ చైర్మన్ రాజీవ్

నేరేడుచర్ల  సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 11వ తేదీ నుంచి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామంలో రాష్ట్రస్థాయి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు సహకారం అందిస్తున్నామని, ఈ ఆటల పోటీలను రాష్ట్ర పౌరసపరాలు నీటిపారుదల శాఖ మంత్రి నలమాధ ఉత్తం కుమార్ రెడ్డి ప్రారంభించనున్నారని రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్ చలసాని రాజీవ్ చెప్పారు. కబడ్డీ ముగ్గుల పోటీల నిర్వాణ కార్యక్రమాలను ఆయన కల్లూరు గ్రామంలో పరిశీలించిన అనంతరం మాట్లాడారు. యువకులు అందరూ కూడా చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాల్సిన అవసరం ఉన్నదన్నారు. నిత్యజీవితంలో బిజీబిజీగా గడిపే వారు అప్పుడప్పుడు ఉల్లాసం ఉత్సాహం కోసం నేహభావం పంపించడం కోసం ఇలాంటి ఆటలు అవసరమని ఆయన చెప్పారు. క్రీడలతో మానసిక ఉల్లాసం ప్రశాంతత లభిస్తుందని, ఆయా గ్రామాలు క్రీడాకారులు వ్యక్తుల మధ్యన సఖ్యత సమైక్యత కోసం తాము క్రీడలను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ఎల్లప్పుడు వంట ఇంటికి పరిమితం కాకుండా మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించవచ్చు అన్నారు. అంతేకాకుండా ఆటల పోటీల వలన క్రీడాకారుల్లో అంతర్గతంగా దాగి ఉన్న నైపుణ్యం బయటపడుతుందని, గ్రామ స్థాయిలో జరిగే ఇలాంటి ఆటల పోటీల్లో పాల్గొని క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుని జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ పోటీలలో విజయం సాధించిన వారికి మంచి మంచి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామన్నారు. క్రీడాకారులందరూ ఈ పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి అవసరం ఉన్న చలసాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీకు సహా సహకారాలు ఎల్లవేళలా అందించడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానని, గ్రామీణ క్రీడాకారులలో ప్రతిభను వెలికి తీసే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఆటల పోటీలలో అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333