శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న అదనపు కలెక్టర్.
జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి. మల్దకల్. ఆది శిలాక్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్నారు. వారికి ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు చేయించారు. అనంతరం స్వామి వారి శేష వస్త్రం చరిత్ర పుస్తకాన్ని బహుకరించారు.