జాజిరెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై ఫిర్యాదు
చేసిన ఎన్ ఎస్ యు ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బల్మురి వెంకట్ ఆదేశాల మేరకు ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ సూచన మేరకు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో 10-07-2024- వ తేదీ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని పట్టుకొని ఏ మాత్రం గౌరవం లేకుండా ఇష్టం వచ్చిన్నట్లు అసభ్య పదజలాలతో తిడుతూ, విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని జాజిరెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన ఎన్ ఎస్ యు ఐ జాజిరెడ్డిగూడెం మండల అధ్యక్షుడు వద్దిగళ్ల బన్నీ.
ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ని కించపరిచే విధంగా ప్రవర్తించిన కిషోర్ పై వెంటనే కేసు నమోదు చేసి తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ సి ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు