శిథిలావస్థకు చేరిన ఎస్టీ గర్ల్స్ హాస్టల్

చర్ల 19-08-25: చర్ల మండల కేంద్రంలో ఉన్న యస్టి గర్ల్స్ హాస్టల్ భవనం శిథిలావ్యవస్థకొచ్చి కూలిపోయే పరిస్థితిలొ ఉంది విద్యార్థినీలకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అధికారులు తక్షణమే అద్దే భవనం ఏర్పాటుచేసి.నూతన భవనం కట్టించాలనీ PDSU-PYL ఆధ్వర్యంలో విద్యార్థినీలతో ధర్నా చర్ల మండల కేంద్రంలో ఉన్న బాలికల గిరిజన హాస్టల్ శిథిలవస్థలో ఉన్నదని ఈ భవనాన్ని తక్షణమే కూల్చివేయాలి ప్రస్తుతం అద్దేభవనం ఏర్పాటుచేసి కొత్త భవనం నిర్మించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు పి వై ఎల్ ప్రగతిల యువజన సంఘం ఆద్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది.
అనంతరం పి డి ఎస్ యు మండల నాయకురాలు శిరీష అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ముసలి సతీష్ మాట్లాడుతూ 130 మంది విద్యార్థులు ఈ భవనంలో ఉంటున్నారని ఈ భవనం నుంచే స్కూలు వెళ్లి చదువుకుంటున్నారని అలాంటి భవనం శిథిలవస్తులో ఉన్నదని వర్షాలు తీవ్రతరం కావడంతోటి గోడలు మొత్తం నాని కురుస్తున్నాయని పెచ్చలు ఊడిపోయి మీద పడుతున్నాయని ఆయన అన్నారు బిల్డింగ్ కూడా కూలిపోయే పరిస్థితిలో ఉందని విద్యార్థినిలు భయాందోళనలో ఉన్నారని ఈ బిల్డింగు శిథిల వ్యవస్థకు వచ్చిందని అధికారులకు తెలిసిన పట్టించుకోని పరిస్థితుల్లో వాళ్ళు లేరని బాత్రూములు కూడా సరిపోను లేవని తక్షణమే నూతన బిల్డింగును ఏర్పాటు చేయాలని కోరారు ఈ బిల్డింగ్లో విద్యార్థినిలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ముందే ఆ ప్రమాదాన్ని గమనించి ప్రభుత్వ అధికారులు అప్పటివరకు తాత్కాలిక హాస్టల్ నీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు