శిక్ష అంటే దండన మాత్రమే కాకుండా ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని

వినూత్న తీర్పు ఇచ్చిన  కోర్టు విధించిన శిక్షను అమలుపరచిన పోలీసులు

Sep 12, 2025 - 19:10
 0  6

మద్యం సేవించడం ద్వారా కలిగే దుష్ప్రభవాలను ప్లకార్డులు ప్రదర్శించి వాహన దారులకు అవగాహన కల్పించిన నిందితులు

 జోగులాంబ గద్వాల 12 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన ఇద్దరు నిందితులకు గద్వాల్ మొదటి అదనపు JFCM కోర్టు  జడ్జి   కొత్త చట్టాలను అమలుపరుస్తూ  గద్వాల్ ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఉన్న కూడలిలో మద్యం సేవించడం వల్ల కలిగే దుష్ప్రభవాల గురించి నిందితులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాహన దారులకు అవగాహన కల్పించాలని నిన్న శిక్ష విధించిగా  నిందితులకు ఇట్టి శిక్షను జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు, ఐ పి ఎస్., ఆదేశాల మేరకు  ట్రాఫిక్ ఎస్సై బాలచందర్ అమలుపరచారు.

ఇట్టి కేసుకు సంబంధించి తేది: 09-09-2025 రాత్రి సమయంలో కేటీ దొడ్డి పోలీస్‌స్టేషన్ పరిధిలో  సిబ్బంది బ్లూ కోల్ట్ డ్యూటీలో  తిరుగుతూ ఉండగా  బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న అంబి రాజు r/o కుచినెర్ల గ్రామము,   వీరన్న r/o ఉమిథ్యాల గ్రామము అను ఇద్దరిని  పోలీస్‌స్టేషన్‌కు తీసుకవచ్చి వారి పై  సెక్షన్ 355  భారతీయ న్యాయ సంహిత ప్రకారం ఈ-పెట్టి కేసు నమోదు చేశారు.
 తదుపరి నిన్న అనగా తేది : 11-09-2025 న చార్జ్‌షీట్‌ను 1వ. అదనపు. JFCM కోర్టులో దాఖలు చేశారు.

 జడ్జి శ్రీ డి. ఉదయ నాయక్ * నిందితులైన అంబి రాజు, వీరన్నలకు కొత్త చట్టం ప్రకారం సామాజిక సేవలో భాగంగా నిందితులు  తేది : 12-09-2025 ఉదయం 10:30 నుంచి 11:30 వరకు గద్వాల్ ఆసుపత్రి ఎదుట ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ "టి" జంక్షన్ వద్ద  మద్యం వల్ల కలిగే దుష్ప్రభవాల పై  ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా సామాజిక సేవ  చెయ్యాలని తీర్పు ఇవ్వవ్వగా ఇట్టి తీర్పును జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఎస్సై  నిందితుల ద్వారా *మద్యం వద్దు -ఫ్యామిలీ ముద్దు, మద్యం సేవించి వాహనాలు నడుపరాదు, మద్యం సేవించి వాహనం నడిపినచో శిక్షర్హులు నినాదాలతో ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ వాహన దారులకు అవగాహనా కల్పించడం జరిగింది.

ఈ తీర్పుతో శిక్షలు అంటే దండన మాత్రమే కాకుండా కొత్త చట్టాలను అనుసరించి  కోర్టు నిందితులకు విధించిన శిక్ష పట్ల  చట్టం యొక్క సరికొత్త దిశకు నాంది పలుకుతూ  కోర్టు సంకేతం ఇచ్చినట్టైంది.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333