వేసవిలో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్

Mar 12, 2024 - 20:06
 0  11
వేసవిలో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్

జోగులాంబ గద్వాల 12 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల రూరల్ వేసవిలో నీటి ఎద్దడి తలేత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం గద్వాల్ పరిధిలోని గోనుపాడు గ్రామంలో మిషన్ భగీరథ త్రాగు నీటి సరఫరాను కలెక్టర్ పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన అధికారులతో  మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బంది కలగకుండా వేసవిలో త్రాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని, మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలన్నారు.  నీరు వృధా కాకుండా చూడాలని, ప్రతిరోజు క్లోరినేషన్ చేయాలని సూచించారు.  లీకేజీలు లేకుండా చూసుకోవాలని,  తెలిపారు. ఈ సందర్భంగా త్రాగు నీరు, బల్క్ వాటర్ సౌలభ్యత, నీటి సరఫరాపై మిషన్ భగీరథ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.  అనంతరం గ్రామ పంచాయితి కార్యాలయంలో నీటి సరఫరాకు సంబంధించిన ఏడు రిజిస్టర్లను, క్లోరోస్కోప్ ద్వారా నీటి స్వచ్ఛతను పరిశీలించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
   

   ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ ఈ జగన్మోహన్, ఈఈ శ్రీధర్ రెడ్డి, డీఈ లు, ఏఈ లు, ఎం.పి.డి. ఓ. ఉమాదేవి,   గ్రామ ప్రత్యేక అధికారి శివకుమార్, ఎం పి ఓ చెన్నయ్య, గ్రామ కార్యదర్శి సాలేహ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333