వెల్దేవి గ్రామంలో ఘనంగా సీతారాముల కళ్యాణం
అడ్డగూడూరు 06 ఏప్రిల్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా వేద పండితులు దేవాలయ అర్చకులు చెంగోలు వెంకటేశ్వర్లు, చెంగోలు కృష్ణమాచార్యులు, శ్రీకాంతాచార్యులు శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవాలయ అర్చకులు చెంగోలు శ్రీధరాచార్యులు శ్రీ అభయ ఆంజనేయ స్వామికి అభిషేకం అష్టోత్తరం శత నామ పూజా కార్యక్రమం సింధూరం వేయడం ఆచార్యుల చేతుల మీదుగా నిర్వహించారు. వెల్దేవి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి ఆలయ కమిటీ అధ్యక్షులు నిమ్మల రమేష్ గౌడ్ అధ్యక్షతన కొంతమంది దాతలు సహాయంతో ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణంలో పాల్గొన్నవారు కుంభం రామలింగం యాదమ్మ, మారోజు ఆగయ్య అంజమ్మ, నిమ్మల రమేష్ గౌడ్ కవిత, అన్నదాన నిర్వహించిన దాత తీపిరెడ్డి అరవింద్ రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి గ్రామస్తులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు.