వెల్దేవి గ్రామంలో గాలివానకు లేచి పోయిన రేకుల షెడ్డు..

ప్రభుత్వ సహాయం కొరకు ఎదురుచూపులు

Oct 21, 2024 - 21:11
Oct 22, 2024 - 08:37
 0  13

అడ్డగూడూరు 21 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన భౌరోజు శేషమ్మ రోజువారి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేది. శనివారం రోజు కురిసిన గాలివానకు రేకుల షెడ్డు లేచిపోయి చెట్లపై వాలాయి శేషమ్మ చెప్పిన వివరాల ప్రకారం శనివారం ఉదయం రోజు వరంగల్ లో ఓ ఫంక్షన్ ఉండగా వెళ్ళింది. అదే రోజు సుమారు సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలివాన భారీగా రావడంతో రేకుల షెడ్డు మొత్తం లేచిపోయి ఉందని బాధను వ్యక్తం చేసింది. బాధితురాలు వచ్చేవరకు ఇంట్లో సామాగ్రి బియ్యం పప్పు ఉప్పు తడిసి ముద్దయ్యాయి బాధితురాలు ప్రభుత్వం సహాయం కొరకు ఎదురుచూపు చూస్తుంది.తక్షణమే అధికారులు పరీక్షించి ప్రభుత్వం చే అందించే సహాయాన్ని అందించాలని కోరినారు.