వీధి దీపాలు వెలుగునిచ్చేది ఎప్పుడో
tirumalagirinews
తిరుమలగిరి 01 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలోని అనంతరం గ్రామంలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేక పలు ప్రాంతాల్లో సమస్య జఠిలమై వీధుల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. నిర్వహణను విస్మరించడంతో కొన్ని చోట్ల రోజంతా వెలుగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ చీకట్లు నెలకొంటున్నాయి. బస్తీలు, కాలనీలు అంధకారం నెలకొనడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం లక్షల రూపాయాలు ఖర్చు చేస్తున్న వెలుగులు పంచకపోవడంతో రాత్రివేళ్లలో అనేకసార్లు పలు ప్రమాదాలు జరుగుతున్నాయి కొంతమంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందుతున్నారు మరికొందరు తీవ్ర గాయాలతో బయటపడుతున్నారు దీంతో అనంతరం గ్రామస్తులు ప్రజలు మరియు వాహనదారులు భయంతో రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని నెలలుగా సమస్య నెలకొన్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధిలైట్లు వెలిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరారు....