వికలాంగుల రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంపి చామల
భువనగిరి 21 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి)ఆధ్వర్యంలో ఈ నెల 29,30,31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో తలపెట్టిన రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..వికలాంగుల హక్కుల సాధన కోసం మరియు వారి సమస్యల పరిష్కార మార్గాల కోసం యాదగిరిగుట్టలో నిర్వహించబోయే ఈ రాష్ట్ర సదస్సుకు అందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.వికలాంగుల సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అదే విధంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. .దివ్యాంగుల హక్కుల రక్షణకు,వారి సమస్యల వైపు ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించడానికి ఈ మూడు రోజుల రాష్ట్ర సదస్సు ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ సదస్సును పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాల్లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.ఆర్.డి)రాష్ట్ర అధ్యక్షులు కే. వెంకట్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం అడవయ్య,యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లేపల్లి స్వామి,కోశాధికారి కొత్త లలిత,ముఖ్య నాయకులు పాండాల శ్రీహరి, చల్లగురిగిలా హరిబాబు, మున్సిపల్ కౌన్సిలర్ గంగాధరి వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.