వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్
జోగులాంబ గద్వాల 29 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.శనివారం సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో పెండింగ్ ధరణి సమస్యల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.జూన్ 15 నుంచి జూన్ 28 వరకు పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్ఐ పట్టా పాస్ పుస్తకం, కోర్టు కేసు, కోర్టు వివాదంలో ఉన్న పట్టా పాస్ పుస్తకం, డేటా కరెక్షన్, జిపిఏ, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ, నూతన పట్టా పాస్ పుస్తకాల జారీ/ నాలా, ఖాతా మెర్జింగ్, భూ సంబంధిత ఫిర్యాదులు, నాలా పిపిబి, పెండింగ్ మ్యూటేషన్, సక్సెషన్, అర్భన్ ల్యాండ్ మొదలగు అంశాలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బి. యం. సంతోష్ మాట్లాడుతూ, జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం వారం రోజుల్లో పూర్తి చేసి ఆన్ లైన్ లో పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరిస్తామని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ ముసిని వెంకటేశ్వర్లు, ఆర్డీవో రామచందర్, అన్ని మండలాల తహసీల్దారులు తదితరులు తదితరులు పాల్గొన్నారు...