విసన్నపేటలో ఆర్యవైశ్యుల సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా వన సమారాధన

తెలంగాణ వార్త ప్రతినిధి :-విస్సన్నపేట లో ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా వన సమారాధన కార్యక్రమం.
కార్తీకమాసం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా,విస్సన్నపేట పట్టణంలోని పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో కార్తిక వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ {తాతయ్య} గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సమాజంలో కార్తీక వనసమారాధనలు నిర్వహించకోవడం మంచి సంప్రదాయమని,అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని,వనభోజనాలతో స్నేహభావం పెంపొందుతుందని,వన సమారాధనల వల్ల ఒకరి పట్ల ఒకరికి మంచి స్నేహబంధం అలవడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.