విశ్వకర్మ పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి
జోగులాంబ గద్వాల 20 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- అయిజ భారతీయ జనతాపార్టీ అయిజ పట్టణ ప్రధాన కార్యదర్శి కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో,ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు ఎస్.రామచంద్ర రెడ్డి పాల్గొని, విశ్వకర్మ యోజన పై అవగాహన కల్పించారు.
ప్రధానమంత్రి విశ్వకర్మకు లబ్ధిదారులు దానికి సంబంధించినటువంటి పలు సమస్యలపై జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడుకి వినతి పత్రం అందజేయడం జరిగింది. అందులో భాగంగా కొంతమందికి వెరిఫికేషన్ రాలేదన్నారు. మరి కొంతమందికి ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి లోన్ శాంక్షన్ అవ్వలేదన్నారు. మరి కొంతమందికి లక్ష రూపాయలు బ్యాంకులో పడిన బ్యాంకు వారు మాత్రం 50,000 మాత్రమే ఇచ్చారని వాపోతున్నారు.
అట్లాగే అయిజలో ట్రైనింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని అన్నారు. టైలర్స్ కి సంబంధించిన వారు కూడా కొంతకాలంగా పెండింగ్లో ఉన్నదని మా దృష్టికి రావడం జరిగింది.అట్లాగే జిల్లా లో మిగిలిన 81 గ్రామ పంచాయతీలలో గ్రామ పంచాయతీ ల కూడా త్వరగా సైట్ ఓపెన్ అవుతుంది అని అన్నారు, సంబంధించినటువంటి విశ్వకర్మ యోజన అప్లై చేసుకున్నారు. అందులో మరికొందరికి స్టైఫాండ్ కింద రావాల్సిన 500 రాలేదని, టూల్ కిట్ సంబంధించిన 15000 రూపాయలు రాలేదని మరికొందరు వాపోయారు.వీరందరికీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి పట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, బూత్ అధ్యక్షులు ఎం.శేఖర్, వినయ్, బసవరాజ్, గణేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.