వివాహితపై అత్యాచారయత్నం.. వ్యక్తిపై కేసు నమోదు

Sep 30, 2024 - 17:42
 0  20
వివాహితపై అత్యాచారయత్నం.. వ్యక్తిపై కేసు నమోదు

గద్వాల రూరల్:-వివాహితపై అత్యాచారయత్నం చేసిన సంఘటన గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..కొండపల్లి గ్రామంలోని ఓ మహిళను గ్రామానికి చెందిన బీరప్ప అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నాడు. ఈ విషయంపై గ్రామ కుల పెద్దల సమక్షంలో పంచాయతీలు సైతం జరిగాయి. తాజాగా వివాహిత ఇంటి ఆవరణలో కాకరకాయలు తెంపుకుంటుండగా నిందితుడు బీరప్ప అనే వ్యక్తి మహిళలపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అతన్ని ప్రతిఘటించి అక్కడి నుంచి పారిపోయింది. అనంతరం బాధితురాలు ఆమె భర్త సహాయంతో గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333