విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తా : డిఈ ..వెంకట కృష్ణయ్య

Jul 6, 2026 - 22:19
Jul 6, 2026 - 23:11
 0  3
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తా : డిఈ ..వెంకట కృష్ణయ్య

 తిరుమలగిరి 07 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నూతన జిల్లా విద్యుత్ ఇంజనీర్ గా బాధ్యతలు స్వీకరించిన  ఎన్ ..వెంకట కృష్ణయ్య అనంతరం మొట్టమొదటిసారిగా తిరుమలగిరి మండలాన్ని సందర్శించారు  ఈ సందర్భంగా  స్థానిక విద్యుత్ అధికారులు శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు అనంతరం డిఈ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు (ఎల్పిఓ) లోకల్ ప్రాసెస్ ఆర్డర్లో అవకతవకలు చోటు చేసుకోకుండా దృష్టి సారిస్తామని క్షేత్రస్థాయిలో లోటుపాట్లు ఉంటే సరి చేస్తామన్నారు తదితర ప్రాంతాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరి చేయడంతో పాటు అవసరమైన చోట స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు అలాగే మండల కేంద్రంలోని తొండ గ్రామంలో రైతు వేదిక పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలోని ఐదు ఎకరాలలో 133 సబ్ స్టేషన్ కు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది త్వరలోనే భూమిని పరిశీలించి పనులు మొదలు పెడతామని అన్నారు ఈ కార్యక్రమంలో    ఏఈ గిరిబాబు , లైన్ ఇన్స్పెక్టర్, లైన్మెన్లు ఎల్ల గౌడ్ , బుచ్చిమల్లు, సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.... 

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి