విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ

Nov 7, 2025 - 04:15
 0  115
విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ

    తిరుమలగిరి 07 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:

 ఐఐటి మద్రాస్ యూనివర్సిటీ నుండి కృత్రిమ మేధస్సు మరియు డేటా సైన్స్ కోర్స్ ను ఆన్‌లైన్ ద్వార చదివి పాస్ అయిన బాష్పాల మల్లేశ్వరి, బేతు శ్రావ్య , యెల్లెంల పావని, యెల్లెంల శైలజ,పోతరాజు మనోజ్ఞ,గొడుగు ఉషాకిరణ్, కొండా ప్రణీత్ కుమార్, ఈరేంటి రాజేష్ లకు  ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారి శాంతయ్య  సర్టిఫికెట్లు ప్రధానం చేయనైనది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మారుతున్న కాలనికనునుంగా విద్యార్ధులు కూడా టెక్నాలజీలో జ్ఞానం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. కృత్రిమ మేధస్సు మరియు డేటా సైన్స్ నందు ఉత్తీర్ణులు అయిన విద్యార్ధులకు అభినందనలు తెలియజేసారు.ఈ కార్యక్రమంలో ఐఐటీ మద్రాస్ ఆన్‌లైన్ కోర్సు గైడ్ వేముల వెంకటేశ్వర్లు, బొజ్జ నాగయ్య, బెదరకోట రాజు, బోల్ల రఘుపతి,పగిళ్ల సైదులు, యస్ డి దస్తగిరి, పోరెళ్ల వెంకన్న లు పాలుగొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి