విద్యార్థులకు బోజనాలు పంపిణీ MLA -BLR
తెలంగాణ వార్తలు మిర్యాలగూడ మార్చి 11 : ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ గ్రంధాలయం నందు శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి విజ్ఞప్తి మేరకు గ్రంథాలయంలో ఉద్యోగాల కోసం చదువుకుంటున్న యువకులు, విద్యార్థులు వేసవి కాలంలో దూరప్రాంతాల గ్రామాల నుంచి వచ్చి మధ్యాహ్న సమయంలో భోజనానికి ఇబ్బంది పడకూడదు అనివారి చదువుకు ఆటంకం కలగకుండా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలని కోరడంతోలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందిఈ సంధర్బంగా లైబ్రెరీలో చదువుకుంటున్న విద్యార్థులు బోజనాలు పంపిణీ చేయడం జరిగిందిఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు గ్రంథాలయంలో విద్యార్థులకు ఈ వేసవి కాలం పూర్తయ్యే వరకు మూడు నెలలు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అని అన్నారుధానికి దాతలు ఎవరైన ముందుకు వచ్చి వారి సహాయ సహకారాలు అందజేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి రమేష్, డాక్టర్ రాజు, సిద్దు నాయక్, ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.