సర్ధార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భగా గాన నివాళి అర్పించిన

తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ తీగల గిరిధర్ రెడ్డి
తుంగతుర్తి ఏప్రిల్ 2 తెలంగాణ వార్త ప్రతినిధి : తుంగతుర్తి మండల కేంద్రంలో బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి 315 వ వర్ధంతి సందర్బంగా పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన *తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతు బహుజన సామాజిక న్యాయం కోసం కృషి చేసిన వ్యక్తి, దళిత బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన గొప్ప మహనీయుడు సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన్ని స్మరించుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న(BN), జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్ద బోయిన అజయ్ కుమార్, దాసరి శ్రీను, టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉప్పుల రాంబాబు, సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ కొండారాజు, నూతనకల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అశోక్ యాదవ్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తప్పట్ల శంకర్, వైస్ ప్రెసిడెంట్ మాచర్ల అనిల్, మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎండి అబ్దుల్, కటకం వెంకటేశ్వర్లు, వంశీ యాదవ్, కటకం సూరయ్య, బొంకూరి నాగయ్య, MD సిద్ధిక్, బొంకూరి రంజిత్, మంగళపల్లి నాగరాజు, కొండ పరశురాం, కొమ్ము జనార్ధన్, మరికంటి అశోక్,మహేష్ తదితరులు పాల్గొన్నారు