విదేశాలకు వెళ్ళే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ నమూనా
ఈ పత్రము ద్వారా సర్వులకూ తెలియజేయునదేమనగా కీసరపల్లి రంగయ్య కుమారుడు, విజయవాడ నివాసియగు 36 ఏళ్ళ వయస్సుగల రఘునాథ్ అనే నేను భారతదేశము నుండి విదేశములకు వెళ్ళుటకు నిర్ణయించుకొని నేను ఇక్కడలేని కాలమునకుగాను ఇందుమూలముగా తాడేపల్లి సుబ్బారావుగారి కుమారుడు విజయవాడ నివాసి 38 ఏళ్ళ వయస్సుగల తాడేపల్లి వెంకటేశ్వరరావు అనే అతన్ని, కనుమూరి వెంకన్న గారి కుమారుడు విజయవాడ నివాసి 36ఏళ్ళ వయస్సుగల గోవిందరావుని జాయింట్గా నా శాసనిక అటార్నీలుగాను, వారిలో ప్రతి ఒక్కరు ఈ క్రింద నమోదు చేసి, సమష్టిగానూ విడివిడిగానూ ఇచ్చిన అధికారములను నా పేరుమీద, నా తరఫున వినియోగించడానికి నియమించుచున్నాను. వారు నా తరఫున చేయవలసిన కర్తవ్యములను ఈ క్రింద ఉదహరించుచున్నాను.
1. నాకు రావలసిన బాకీలు, నేను చెల్లించవలసిన బాకీలు నా తరఫున వీరిద్దరు జాయింటుగా వసూలు/లేదా చెల్లింపు చేయవచ్చును. నా తరఫున అప్పులు, సరుకులు, వస్తువులు, హామీలు, స్టాకులు, భాగములు మరియు ప్రయోజనములకు సంబంధించిన ప్రతి వ్యక్తి లేక వ్యక్తులకు లేక ఛార్జీ చేయబడదగిన ఇతరులందరికీ అభ్యర్థన ద్వారా లేక డిమాండు ద్వారా లేక దావా ద్వారా రాబట్టి తీసుకోవచ్చును.
2. ప్రస్తుతం నా అధీనంలో ఉన్న ఆస్తులను, భూములను, కౌలు భూములను నా తరఫున స్వాధీనం చేసుకోవడానికి గాని, అటువంటి పూర్తి ఆస్తిని గాని, దానిలోని భాగమునుగాని సంబంధించిన ఏ చర్యను లేక ప్రొసీడింగులు తీసుకొనుటకు, వాటి అద్దెలు, కౌలులు వసూలు చేసి రశీదు ఇచ్చుటకు, సదరు ఆస్తిని లేక అందులోని కొంత భాగమును అద్దెకివ్వటానికి గాని, అమ్మటానికి గాని లేక బదిలీ చేయటానికి, ఇతరులకు వ్రాసి ఇవ్వడానికి వారికి అధికారము ఈ పత్రము ద్వారా ఇవ్వబడుతున్నది.
3. నా పేరుమీద, నా తరఫున, నా వ్యవహారములకు సంబంధించిన దస్తావేజులపై తానే సంతకము చేసి, ఏదైనా దావా పత్రమును, జవాబు పత్రమును, కాంట్రాక్టును,ఖరారును, కౌలును, అసైన్మెంటును లేదా ఏదేని ఆస్తి, భూమి లేదా కమతము పూర్తిగా లేదా దానిలోని భాగమును వ్రాసి యిచ్చుటకు మరియు అటువంటి బదలాయింపులలో ఈయవలసిన రశీదులుగాని, విడుదల పత్రములుగాని అందుకొనుటకు లేదా ఇచ్చుటకు అధికారమివ్వబడినది.
4. నా వ్యవహారములలో అవసరమైనప్పుడల్లా నా తరఫున రిజిస్టరు అధికారి ఎదుట హాజరగుటకు, అట్టి అధికారి ఎదుట. అట్టి దస్తావేజులు లేదా దస్తావేజుల అమలును అంగీకరించటానికి కాని, ప్రతిఫలము ముట్టినట్లు అంగీకరించుటకు, ఆ దస్తావేజు లేదా దస్తావేజు రిజిస్ట్రేషను పూర్తి చేయుటకుగాను అధికారమివ్వబడినది.
5. అన్ని రకముల స్థిరచరాస్తుల్లో నాకు చెందిన దానికి సంబంధించిన చర్యలు మరియు ఇతర ప్రొసీడింగులను, నాకు, ఇతర వ్యక్తుల మధ్యగల అన్ని వ్యవహారములు, దావాలు, ఎకౌంట్లు మరియు తగాదాలను కాంపౌండు చేయుటకు, రాజీ చేయుటకు లేదా మధ్యవర్తిత్వమునకు సమర్పించుటకు, నాకు సంబంధించిన ఏ కేసుగాని, దావాగానీ, ఇతర ప్రొసీడింగులనుగాని 'నడుపుటకుగాను ఎవరైనా న్యాయవాదిని లేక అడ్వకేటును నియమించుకొను అధికారమివ్వబడినది.
6. నాకు బదలాయింపు కానున్న లేదా ముందు ముందు బదలీ కాబోయే స్టాక్సు నిధులు, షేర్సు, మరియు హామీలు, ఇతర నగదు ప్రతిఫలములు మొదలైన వాటిని అంగీకరించుటకు, మరియు ఏదేని కంపెనీ సమావేశంలో నేను ఆ కంపెనీలో కలిగియున్న స్టాకులు, షేరులు లేదా ఇతర పెట్టుబడులకు సంబంధించి లేదా ఇకముందు నేను సంపాదించే అట్టి వాటికి సంబంధించి ఓటు చేయుటకు లేదా ఇతర విధముగా నా అటార్నీలుగా లేదా ప్రోక్సీ లేదా ప్రోక్సీలుగా వ్యవహరించుటకు, అధికారం యివ్వడమైనది.
7. పైన పేర్కొన్న అటార్నీలు నాకు చెందిన డబ్బును వారి విచక్షణ మేరకు నా పేరున గాని, వారి పేరునగాని తలచిన రీతిలో బ్యాంకులలో గాని, పోస్టు ఆఫీసులో కాని డిపాజిటు చేయుటకు సంపూర్ణ అధికారమివ్వబడినది.
8. పైన చెప్పిన ప్రయోజనముల నిమిత్తం, నా బ్యాంకు ఖాతానుండి తమకు యుక్తమని తలచిన సమయంలో చెక్కు ద్వారా గాని, విత్అ ఫారంపైన గాని నా తరఫున వ్రాయుటకు, ఇతరులకు చెల్లింపు చేయుటకు, సంతకము చేయుటకు, నాకు అందవలసిన ఇతర పెట్టుబడులను గూర్చి వ్రాయుటకు అధికారమివ్వబడినది.
9. పైన పేర్కొన్న విషయములలో లేదా వానిలోని కొన్నిటిలో నా అటార్నీలు హాజరుకాలేని పనులకు వారి క్రింద నా తరఫున ఏజెంటును నియమించుకొనుటకు సంపూర్ణ అధికారమివ్వడమైనది.
10. నేను భారతదేశమునుండి బయటకు వెళ్ళిన సమయములో నేను స్వయముగా నిర్వహించుచున్న విధముగానే నాకు సంబంధించిన సంస్థలలో వివిధ స్వభావములకు చెందిన అన్ని వ్యాపారములలోనూ, అవసరమయినట్టి, యుక్తమగునట్టి ఎలాంటి పనులను, విషయములను చేయుటకు, అమలు జరుపుటకు, నెరవేర్చుటకు కీసరపల్లి రఘునాథ్ అనే నేను నియమించిన అటార్నీలు లేదా వారు డిప్యూటు చేసిన, నియామకము చేసిన వారి క్రింద ఏజెంట్లు పైన పేర్కొన్న అధికారముల క్రింద చట్టబద్ధముగా చేసిన లేదా చేయించిన అన్నిటినీ ఖాయము చేయుటకు, ధ్రువపరచుటకు ఇందుమూలముగా అంగీకరించుచున్నాను.
నేను ఈ పవర్ ఆఫ్ అటార్నీని 22.11.2005 తేదీ నుండి ఇందుమూలముగా వ్రాసి ఇస్తున్నానని తెలియజేయుచున్నాను.
కీసరపల్లి రఘునాథ్ అను నేను నా సమ్మతితో ఈ దస్తావేజుపై సాక్షుల సమక్షమున 22.11.2005 తేదీన సంతకము చేసినాను.
సాక్షులు:
1.
(సం.) కీసరపల్లి రఘునాథ్
2.
పవర్ ఆఫ్ అటార్నీ వ్రాసి ఇచ్చినవారు (Executor)