జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా
ఇందుమూలముగా కీసరపల్లి రఘునాథ్ అనే నేను సర్వులకూ తెలియజేయునది ఏమనగా, తాడేపల్లి సుబ్బారావుగారి కుమారుడు విజయవాడ నివాసి 38 వయస్సు, తాడేపల్లి వెంకటేశ్వరరావును నా అటార్నీగా నియమిస్తూ, నా పేర మరియు నా తరఫున ఈ క్రింది పేర్కొన్న అన్ని చర్యలను లేదా పనులను చేయుటకు లేదా చేయించుటకు అధికారమీయడమైనది.
1. అన్ని రకములైన అపిలేటు. సివిలు, క్రిమినలు. రెవిన్యూకోర్టులలో, రిజిస్ట్రేషను ఆఫీసులలో లేదా ప్రభుత్వ ఆఫీసులలో లేదా ఇంకా ఏదైనా జిల్లా పరిషత్తు, మునిసిపల్ ఆఫీసు లేదా మండల కార్యాలయం లేదా ఇతర స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం, లేక ఆఫీసరుగారి సమక్షంలో నా బదులు వ్యవహారము నడిపించుటకు అధికారమీయడమైనది.
2. అన్ని రకముల దావాపత్రములను, క్లెయిములను, జవాబులను, పిటీషనులను, ఇంకా ఇతర రకముల దరఖాస్తులను సంతకముతో ధ్రువీకరించుటకు, మరియు ఎటువంటి కోర్టులలోను, ఆఫీసులలోను దాఖలు చేయటానికి అధికారమివ్వడమైనది.
3. అడ్వకేటును, ప్లీడరును లేదా ఎవరేని ఇతర న్యాయవాదిని అవసరము మేరకు నియమించుకొనుటకు అధికారమీయడమైనది.
4. రాజీ చేయుటకు, కాంపౌండు చేయుటకు, కేసులను ఉపసంహరించు టకు లేదా తీర్పులను అంగీకరించుటకు మరియు కేసులను మధ్యవర్తిత్వమునకు నిర్దేశించుటకు నా తరఫున వ్యవహరించుటకు అధికారమీయడమైనది.
5. అన్నిరకముల పత్రములను దాఖలు చేయుటకు, తిరిగి వాపసు తీసికొనుటకు, డబ్బును డిపాజిటు చేయుటకు, తిరిగి తీసికొనుటకు మరియు తీసుకున్న డబ్బుకు రశీదు ఇచ్చుటకు అధికారమివ్వడమైనది.
6. స్టాంపు డ్యూటీని వాపసు పుచ్చుకొనుటకు లేదా కోర్టు ఫీజును తిరిగి పుచ్చుకొను అధికారమివ్వడమైనది.
7. కోర్టు నిర్వహించు వేలములలో ఆస్తులను నా పేర గల డిక్రీలను అమలు జరుపునపుడు ఆ డిక్రీ మొత్తము మేర కొనుగోలు చేయు అధికారమిచ్చుచున్నాను. మరియు నాపేరున ఉన్న డిక్రీలు అమలు చేసి సదరు ఆస్తి స్వాధీనము చేసుకొనుటకు,
వేలంలో పాడుకొన్న ఆస్తిని నా తరఫున స్వాధీనము చేసుకొనుటకు కూడా అధికారమిస్తున్నాను.
8. నాకు రావలసిన అప్పులను రాబట్టుట, నా ఇండ్లలోని అద్దెదారుల నుండి, భూమి నుండి అద్దెలను వసూలు చేయుట, అందుకుగాను రశీదులిచ్చి రుణ విమోచనము కలుగచేయు అధికారమిచ్చుచున్నాను.
10. పై చెప్పిన ప్రయోజనములకుగాను తగిన సమయంలో అవసరమైన అన్ని చట్టసంబంధమైన పనులను చేయుటకు అధికారమిచ్చుచున్నాను.
అయితే, ఇందుమూలముగా ఇస్తున్న అధికారములు ఈ క్రింది వాటికి వర్తింపవు.
అవి ఏవనగా:-
1. రూ. 15,000 లకు మించి సాలుసరి అద్దెను నిర్ణయించటం, 10. సంవత్సరములకు మించి వ్యవసాయంనకు కౌలుకివ్వడం.
2. ఇంటి ఆస్తిని 3 సంవత్సరములకు మించిగాని, రూ.1000 ల నెలసరి అద్దెకు మించిగాని అద్దెకు ఇవ్వడం,
3. రూ. 15,000 లకు మించిన విలువగల క్లెయిమును రాజీ చేయటం, ఉపసంహరించటం లేదా రూ.25,000 ల విలువగల ఆస్తికి సంబంధించిన క్లెయిమును రాజీ చేయడం.
4. ఏదేని డబ్బును అప్పు తేవడం లేదా ఏదేని ఆస్తిని తాకట్టు పెట్టుట లేదా దానిపై ఛార్జీని సృష్టించడం.
నాచే నియమించబడిన అటార్నీ చట్టసమ్మతంగా చేయు పనులు, ఒప్పందములు, దస్తావేజులు మరియు ఇతరములైన పనులు అన్నీ నా తరఫున చేయుచున్నారు కాబట్టి అన్ని పనులు నేనే స్వయముగా చేసినట్లు పరిగణించవలసినదిగా తెలియజేయుచూ. అతడు చేసిన పనులు అన్నీ ఖాయము చేయుటకు ఇందుమూలముగా నేను అంగీకరించడమైనది.
కీసరపల్లి రఘునాథ్ అను నేను ఈ 22.11.2005 తేదీన సాక్షుల సమక్షములో ఈ దస్తావేజుపై సంతకము చేయడమైనది.
సాక్షులు:
1.
2.
కీసరపల్లి రఘునాథ్
పవర్ ఆఫ్ అటార్నీ యిచ్చినవారు (Executor)
16
మీరూ దస్తావేజులు రాయొచ్చు