విజయ సంకల్పయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్
కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి బిజెపి యాత్రలు

తుంగతుర్తి:ఫిబ్రవరి:22 తెలంగాణవార్త ప్రతినిధి:- భారత దేశంలో ప్రజల సుభిక్షంగా ఉండాలంటే మోడీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కావాలని అన్నారు. తెలంగాణలో పదికి పైగా పార్లమెంట్ సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ సమరశంఖం పూరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రథయాత్రలకు సిద్ధమైంది. దేశమంతా మోదీ నాయకత్వాన్ని కోరుకుటోందని చెప్పారు. ఈటల రాజేందర్ తెలంగాణలో పార్టీలను చూడకుండా మోదీకి ఓట్లెయ్యడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రజల ఆదరణ కోల్పోయిందన్నారు. కాంగ్రెస్ అలవికాని హామీలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామన్నారు. గెలిచే వారికే టికెట్లు ఉంటాయని, పార్లమెంట్ బరిలో తాను కూడా ఉంటానని ఈటల రాజేందర్ తెలిపారు.రాష్ట్రంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఏ రాజకీయ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే 17 పార్లమెంట్ స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు ఒకేసారి ఐదు యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అగ్రనేతలు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వీలుగా ఒకేసారి ఐదు ప్రాంతాల్లో యాత్రలు చేపట్టామన్నారు. బిజెపికి తెలంగాణలో పూర్తి మద్దతు ఉందని, తాము ఒంటరిగానే గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
బిఆర్‌ఎస్‌తో బిజెపి పొత్తు అంటే ఎవరైనా దాన్ని తిప్పికొట్టాలనుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆపార్టీతో ఎట్టి పరిస్ధితిలో జత కట్టమని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లుతామని తేల్చిచెప్పారు. అన్ని స్ధానాల్లో పోటీ చేసి మెజారిటీ స్థానాల్లో గెలుపొందడమే లక్షంగా పనిచేస్తామని, మునిగిపోతున్న బిఆర్‌ఎస్‌తో స్నేహం ఉండదని స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడు తమ పార్టీ బిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. కొందరు నాయకులు కుట్రపూరితంగా బిఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారని, బుద్ధి లేని వ్యక్తులు చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్ర ప్రజలు బిజెపి శ్రేణులను ఆశీర్వదించాలని, బహిరంగ సభలు ఉండవని, రోడ్ షోలతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు తొలి సమావేశంలోనే తెలంగాణ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ యాత్రలు పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు యాత్రలు సమాంతరంగా ప్రారంభమైయాయి. యాత్రలో భాగంగా రైతులు, చేతివృత్తిదారులు, నిరుద్యోగులు, పొదుపు సంఘాల మహిళలు, అన్ని వర్గాల ప్రజలను కలుస్తారని వెల్లడించారు.