విజయవంతమైన ఉచిత వైద్య సేవ

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం వేద నగర్ దయానంద విద్యా సమితి నందు ఉచిత వైద్య సేవ కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం శుభకర హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ D.లావణ్య మహంకాళి MBBS, MS( Ophthal )కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. కంటి శుక్లాల కొరకు ఆపరేషన్కు అవసరమైన వారికి కంటి ఆపరేషన్ కూడా నిర్వహిస్తామని తెలిపారు. కంటి సమస్యలపై వచ్చిన వారిని పరీక్షించి కంటికి సంబంధించిన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వేదనగర్ నందు నిరుపేద చేనేత కార్మికులు, కంటి చూపుతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సేవలు చేయాలని సంకల్పంతో వైద్య శిబిరాలలో వైద్యం చేయడానికి నిశ్చయించుకున్నానని డాక్టర్ D.లావణ్య మహంకాళి తెలిపారు. దయానంద విద్యా మందిరంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న వైద్య శిబిరాలు ఈ వారంతో 40 ఆదివారాలు వైద్య శిబిరాలు పూర్తి చేశామని , ప్రతి ఆదివారం ఒక్కొక్క వ్యాధికి సంబంధించిన నిపుణుల డాక్టర్లను పిలిపించి ఉచిత వైద్యం నిర్వహిస్తున్నామని, ఇలాగే ప్రతి ఆదివారం నిపుణులైన డాక్టర్లచే ఉచిత వైద్య సేవ నిర్వహిస్తామని , పాఠశాల ప్రిన్సిపల్ హరినాథ్ రెడ్డి తెలిపారు. ఈరోజు కంటికి సంబంధించిన నిపుణురాలు డాక్టర్ D.లావణ్య మహంకాళి చే ఉచిత వైద్య సేవ నిర్వహిస్తున్నామని దాదాపు 125 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశామని పాఠశాల హెడ్ మాస్టర్ సత్యకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు ఉచిత వైద్యానికి అధిక సంఖ్యలో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ సత్యకుమార్, కళ్యాణ్, దోత్రే మనోజ్, తదితర పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.