వికలాంగులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు 

Jan 28, 2026 - 19:46
 0  18
వికలాంగులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు 

వికలాంగులు ఆత్మవిశ్వసంతో ముందుకు సాగాలి -జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ 

భువనగిరి 28 జనవరి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎన్.పి.ఆర్.డి తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన 2026 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా ఎస్పీ ఆకాంశ యాదవ్ సంయుక్త్ణంగా  ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ..జిల్లాలోని అందరు వికలాంగులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకొని ముందుకు సాగాలని జిల్లా లోని వికలాంగులు ఎదురుకుంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకు రావాలని వారు ఈ సందర్బంగా తెలియజేయజేయడం జరిగింది.అదేవిదంగా  వికలాంగుల హక్కుల సాధన కోసం ఎన్.పి.ఆర్.డి చేస్తున్న కృషి అభినందన నియమని కొనియాడారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఎస్పీ ఆకాంశ యాదవ్ మాట్లాడుతూ..వికలాంగులు తమకున్న లోపాన్ని అధిగమించి జీవితంలో రాణించాలని వారు పిలుపు నివ్వడ జరిగింది.వికలాంగులను వైకల్యం పేరుతోటి వారిని కించపరిచిన లేదా దూషించిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.జిల్లాలోని వికలాంగులందరు ఆత్మవిశ్వసంతో ముందుకు సాగాలని వారు అన్నారు.ఎన్ పి.ఆర్.డి జిల్లా అధ్యక్షు కార్యదర్శిలు సురూపంగా  ప్రకాష్ వనం ఉపేందర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వికలాంగులను మోసం చేస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్న పెన్షన్ ఎందుకు పెంచడం లేదని అన్నారు.పెన్షన్ పెంపు కోసం 44 లక్షల మంది చేయూత లబ్దారులు ఎదురుచూస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో వికలాంగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. స్థానిక సంస్థలు వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత,బట్టురాంచంద్రయ్య,సుదర్శన్,రాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333