తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ సైబర్ నేరాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి* ఆత్మకూర్ ఎస్....సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఏపూరు శాఖ మేనేజర్ రామకృష్ణ సూచించారు. బుధవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఏపూర్ శాఖ ఆధ్వర్యంలో రామన్నగూడెం గ్రామ పంచాయతీ వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆధార కార్డు నెంబర్, బ్యాంకు వివరాలు, ఓటిపి అపరచిత వ్యక్తులకు చెప్పకూడదని తెలిపారు. కేవైసీ పేరుతో బయట వ్యక్తులకు ఆధార్ జిరాక్స్ ఇవ్వకూడదన్నారు. అలాగే రైతులు రుణాలు, క్రాఫ్ లోన్లు సకాలంలో చెల్లిస్తే తక్కువ వడ్డీ వర్తిస్తుందని చెప్పారు. రామన్నగూడెం సర్పంచ్ బత్తుల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ బ్యాంకు రైతులకు తక్కువ వడ్డీకే రుణాలను అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది సిహెచ్ అశోక్, బి. సైదులు, రామన్నగూడెం ఉపసర్పంచ్ కృష్ణారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.