ప్రభుత్వ భూములను కాపాడండి..... వేమూరి
మునగాల 25 జూన్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి :- మండలంలో అన్ని గ్రామాల పరిధిలో ఉన్న వివిధ రకాల ప్రభుత్వ భూములను కాపాడాలని తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ మునగాల తహసిల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమం సందర్భంగా మండల పరిధిలోని నరసింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ కొన్ని సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ ఆంజనేయిలు కి సమర్పించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ .... మండల పరిధిలో అన్ని గ్రామాలలో ఉన్న. వివిధ దేవాలయాల భూములు వక్ఫ్ బోర్డు భూములు. చెరువు శిఖాలు గ్రామ కంఠం భూములు. అసైన్డ్ భూములతో పాటు. వివిధ రకాల ప్రభుత్వ భూములను సర్వే చేపించి హద్దురాళ్లను ఏర్పాటు చేసి. ఆయా భూముల వద్ద సర్వే నెంబర్లు విస్తీర్ణంతో సహా సూచిక బోర్డులను ఏర్పాటు చేసి ఆయా గ్రామ పంచాయతీలలో ఆయా దేవాలయాల వద్ద అట్టి వివరాలను బహిరంగపరచి అట్టి భూములు అన్యాక్రాంతం కాకుండా అక్రమ రిజిస్ట్రేషన్లు కాకుండా కాపాడి ఆయా గ్రామాలలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి అదేవిధంగా ఆయా గ్రామాలలో ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేసేందుకు గ్రామానికి అవసరమైన మేరకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోని మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని తహసిల్దార్ ఆంజనేయులు ను కోరినట్లు సత్యనారాయణ తెలిపారు.