వరద బాధితుల సహాయానికి మేమున్నాం

Sep 3, 2024 - 19:55
Sep 3, 2024 - 21:11
 0  1
వరద బాధితుల సహాయానికి మేమున్నాం

-తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం

-వరద బాధితులకు సహకరించిన ఉద్యోగులు

మంచిర్యాల, సెప్టెంబర్ 03 (తెలంగాణ వార్త):- తెలంగాణ రాష్ట్రంలో గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో ప్రజల జీవన వ్యవస్థ అస్తవ్యస్తమైందని వర్షం కారణంగా తినటానికి సరైన తిండి లేక ఉండటానికి విలువ నీడ లేక అదే విధంగా కట్టుబట్టలు ఒక్కటే దిక్కు అయిన దయనీయ పరిస్థితి చాలా ప్రాంతాల్లో వరద ప్రభావంతో తీవ్ర ఆస్తి నష్టం పంట నష్టం జరగడం చాలా బాధాకరం ఇట్టి బాధాకర విషయాన్ని గ్రహించినటువంటి తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో సభ్యులందరి ఏకగ్రీవ తీర్మానంతో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం విధులు నిర్వహిస్తున్న అధికారులందరూ ప్రతి ఉద్యోగి మూలవేతరం నుండి ఒకరోజు మూలవేతనం వరద సహాయ నిధికి ఇవ్వడంపై మంచిర్యాల జిల్లా జేఏసీ చైర్మన్ టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి హర్షం వ్యక్తపరిచారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..

  రాష్ట్రవ్యాప్తంగా వరదల వల్ల నష్టపోయిన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రభుత్వ ఉద్యోగుల తరపున ఒకరోజు మూల వేతనాన్ని అందజేస్తున్న తీర్మానాన్ని జేఏసీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాష్ట్ర జేఏసీ నాయకులు అందజేయడం జరిగిందని అన్నారు. ఎలాంటి ప్రకృతి విపత్తు అయిన సరే స్వచ్ఛందంగా ప్రజలకు సహాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడంలో ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు ఎల్లప్పుడూ ముందుంటారని గతంలో కూడా చాలా సందర్భాలలో వరద బాధితులకు ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఉద్యోగులు ముందుండి వారి సహాయ సహకారాలు అందించామని అన్నారు. అదేవిధంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మంచిర్యాల జిల్లా ఉద్యోగులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేశారు.

ఈ సమావేశంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, మంచిర్యాల జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీపతి బాపురావు, కోశాధికారి ఏ సతీష్ కుమార్, ఉపాధ్యక్షులు కేజియా రాణి, శ్రీనివాస్, రామ్ కుమార్, తిరుపతి, అంజయ్య, సంయుక్త కార్యదర్శిలు సునీత, పద్మలత ప్రభు, వెంకటకృష్ణ పబ్లిసిటీ సెక్రటరీ యూసఫ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రావణ్ మంచిర్యాల యూనిట్ అధ్యక్షులు నాగుల గోపాల్ కార్యదర్శి అజయ్ మందమర్రి యూనిట్ అద్యక్షులు సుమన్ బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షులు వెంకటేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు మోసిన్, కుమార్, సంజీవ్, ప్రణవానంద్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333