ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి టీజేఎస్ మద్దతు..... గట్ల రమా శంకర్
ఈనెల 27న జరగనున్న వరంగల్ నల్గొండ ఖమ్మం శాసనమండలి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి పార్టీకి లేఖ రాసిన నేపథ్యంలో తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్ తెలిపారు ఈరోజు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాలనలో విద్వంసం సృష్టించి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి చావు దెబ్బ తి ని .ఎన్ని అక్రమాల కైనా పాల్పడి తన ఉనికిని చాటుకునీ తన అక్రమాల నుండి కాపాడు కోవడానికి ఈ ఎన్నికలను ఉపయోగించు కునే ప్రయత్నం చేస్తున్న బి ఆర్ ఎస్ ను, ఎప్పటికప్పుడు తెలంగాణ ఏర్పాటు పై విషం కక్కుతూ పదేండ్ల పాలనలో ఏ ఒక్క విభజన హామీ నీ నెరవేర్చ నీ బిజేపి ఓడించుటకొరకు కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. పట్ట బద్రులు కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని గెలిపించ వలసింది గా విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్ గౌడ్ లీగల్ సెల్ జిల్లా కోకన్వీనర్ వీరేష్ నాయక్ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ బచ్చలకూర గోపి, విద్యార్థి జన సమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్, మన్సూర్ నాయక్ యాకోబు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.