వరదల ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.

Sep 3, 2024 - 09:23
 0  7
వరదల ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు.

భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం మార్గమధ్యలో సూర్యాపేటలో ఆగి, ఆ జిల్లాలో జరిగిన నష్టంపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సూర్యాపేట కలెక్టరేట్ లో మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో పరిస్థితిని సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. 

ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెం దగ్గర దెబ్బ తిన్న రోడ్డు అక్కడి నుంచి పాలేరు - పాలేరు రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ ను, అక్కడ దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలైన రాజీవ్ గృహకల్ప కాలనీ, ఎఫ్సీఐ రోడ్డు, బొక్కలగడ్డ కాలనీ, పెద్ద తండా తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారినుద్దేశించి ప్రసంగించి భరోసానిచ్చారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333