వనమహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటిన..... జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Jul 31, 2025 - 20:20
Aug 1, 2025 - 20:01
 0  0
వనమహోత్సవంలో భాగంగా ఈత మొక్కలు నాటిన.....   జిల్లా కలెక్టర్   తేజస్ నంద్ లాల్ పవార్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  . ఈత వనాలను కాపాడితే గౌడ కుటుంబాలకి జీవనదారం అవుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. వనమహోత్సవం లో భాగంగా గురువారం ఆత్మకూరు (ఎస్ ) మండలం పాత సూర్యాపేట గ్రామంలో గౌడ సొసైటీ భూమిలో ఈత వనాలు నాటిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట గ్రామంలోని గౌడ సొసైటీ నాలుగు ఎకరాల్లో 1600 మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని ఈత మొక్కలని సంరక్షించాలని, నీటి కొరకు బోర్ వెల్ మంజూరు చేస్తామని, అలాగే నీటి తోట్టెలను నిర్మించి వాటి నీటి తో మొక్కలకు నీరు పోయాలన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ సతీష్ కుమార్,సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కే వేణా రేడ్డి, ఆర్ డి ఎ పిడి వివి అప్పారావు ,ఎక్సయిజ్ సూపరిటీడెంట్ లక్ష్మా నాయక్,డి ఎల్ పి ఓ నారాయణ రెడ్డి,తహసీల్దార్ అమీన్ సింగ్,ఎంపిడిఓ మహమ్మద్ హసీం, పంచాయతీ కార్యదర్శి స్వప్న,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ... డి పి ఆర్ ఓ.... సూర్యాపేట....