జిల్లా గ్రంధాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

Mar 2, 2026 - 19:37
 0  1
జిల్లా గ్రంధాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలి

నిర్మాణంలో ఉన్న గ్రంధాలయ బిల్డింగ్ ని పూర్తి చేయాలి.

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి వినతి.

 జోగులాంబ గద్వాల 2 మార్చి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారికి  శాలువా బొకేతో స్వాగత శుభాకాంక్షలు తెలిపారు

ఈ సందర్బంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య మాట్లాడుతూ... 

జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు లేక పాఠకులు చాలా రోజుల నుంచి తీవ్రమైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. మహిళ పాఠకులకు టాయిలెట్స్ బాత్రూమ్స్ లేక ఇబ్బందులకు గురవుతున్నారు.

అదేవిధంగా గ్రంధాలయంలో మంత్లీ మ్యాగజైన్స్, అప్డేట్ అయినా డీఎస్సీ గ్రూప్స్ మెటీరియల్ లేక పాఠకులకు ఇబ్బంది కరంగా ఉంది. అదేవిధంగా ఫాన్స్ కుర్చీలు కూడా లేవని పాఠకులు వాపోతున్నారు అని తెలిపారు.

జిల్లాలో అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగా నడుపుతున్నారు వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో చాలా ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ, నామ్స్ ప్రకారం సదుపాయాలు లేకుండా పాఠశాలలను నడుపుతున్నారని అని తెలిపారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో విద్యాభివృద్ధి కోసం కృషి చేయాలని కలెక్టర్ కి బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కురువ పల్లయ్య విన్నవించారు.  ఈ కార్యక్రమంలో కొమ్ము రంగస్వామి బండారి అభిషేక్, రమేష్ నరేష్ తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333