వడ దెబ్బతో వ్యక్తి మృతి

May 21, 2026 - 10:42
 0  4
వడ దెబ్బతో వ్యక్తి మృతి

 గుండాల 21 మే 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

గుండాల మండలం పరిధిలో వస్తా కొండూరు గ్రామంలో వడదెబ్బ కారణంగా వ్యక్తి మృతి

 యాదాద్రి  భువనగిరి  జిల్లా గుండాల మండలం పరిధిలోని వస్తా కొండూరు గ్రామంలో వడ దెబ్బ కారణంగా ఒ వ్యక్తి మృతి   చెందారు  గత వారం రోజులుగా తీవ్ర ఎండలు ప్రభాతంతో అస్వాస్థకు గురై గ్రామానికి చెందిన సింగారం నరసయ్య తండ్రి చెన్నయ్య (55) సంవత్సరాలు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు ఇటీవల వారం రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లడం ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం లేకుండా ఎండలో తిరగవద్దని తగినంత ద్రవాలు తీసుకోవాలని అధికారులు సూచించారు..

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి