మాచర్ల లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డాక్టర్" ఆలేటి శ్రీనివాస్ గౌడ్

May 21, 2026 - 13:35
May 21, 2026 - 13:36
 0  4
మాచర్ల లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన డాక్టర్" ఆలేటి శ్రీనివాస్ గౌడ్

నకిరేకల్ 21 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– నల్గొండ జిల్లా నకిరేకల్ మండల పరిధిలోని నోముల గ్రామానికి చెందిన మాచర్ల లక్ష్మయ్య కొద్దిరోజుల క్రితం గుండె పోటుతో మృతి చెందారు.అట్టి విషయం తెలుసుకున్న పవన్ సాయి హాస్పిటల్ అధినేత డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ మాచర్ల లక్ష్మయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యంగా నిలిచారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోడ సునీల్ మాదిగ,బాకీ వెంకటయ్య,మాదిగ గ్యార శ్రీనివాస్ మాదిగ,మాచర్ల శ్రీను మాచర్ల జానీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.