లో వోల్టేజీ, ఎర్త్ సమస్యను తీర్చండి
జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. : ఎర్రవల్లి మండలం. బీచుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోగల కొండపేట గ్రామంలో గత కొన్ని రోజులుగా లో వోల్టాజీ, ఎర్త్ సమస్య ఉందని వాటిని వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు మంగళవారం విద్యుత్ ఏఈ శేఖర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండపేట గ్రామం నందు సరఫరా అయ్యే విద్యుత్ లో వోల్టేజ్ వస్తుందనీ అలాగే ఎర్త్ సమస్య, ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉందనీ తెలిపారు. గ్రామంలో వ్యవసాయం కొరకు అందించే కరెంట్ కూడా సమ్య ఉన్నదనీ విద్యుత్ సమ్యలను వెంటనే పరిష్కరించి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని వారు ఏ ఏనికి వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.