రైతు బీమా 5లక్షల రూపాయలు చెక్కు అందజేసిన ఎమ్మెల్యే గారు

ఈ రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కె.టి దొడ్డి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన రైతు రాథయ్య అనారోగ్యం తో మరణించారు వారి కుటుంబ సభ్యులైన భార్య అరుణమ్మ కు ప్రభుత్వం తరుపున ఆర్థిక సాయం ను *గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి* చేతుల మీదుగా రైతు బీమా ద్వారా నిరుపేద కుటుంబానికి 5 లక్షలు రూపాయల చెక్కును అందజేశారు.
ఎమ్మెల్యే గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి,మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్ మురళి,మాజీ సర్పంచ్ ఆంజనేయులు నాయకులు గోపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.