రైతులు పంట నమోదు చేసుకోవాలి
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించాలంటే నమోదు తప్పనిసరి ఏవో.
జోగులాంబ గద్వాల 28 ఆగస్టు 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఇటిక్యాల . మండలంలోని సాగు చేసిన ప్రతి రైతు తమ పంటను వివరాలను ఏ ఈ ఓల దగ్గర తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి ఏవో రవికుమార్. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా పండించిన పంట నమోదు తప్పనిసరి. పంట నమోదు చేసుకుని రైతులు విక్రయించే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వరు సాగు చేసిన రైతులు ప్రభుత్వం నిర్ధారించిన ఏడు సన్న రకాల వరి పంగదాలను మాత్రమే సాగు చేయాలి. 1 సిరిసిల్ల 2బి భేటీ 3 నూజివీడు 4కౌశిక్ 5 హెచ్ఎంటి 6 ధనలక్ష్మి 7 రమేష్ పంట నమోదు చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలను పొందండి ఏవో రవికుమార్ తెలియజేశారు. మండలంలోని వివిధ గ్రామాల రైతులు వారి గ్రామాల ఏఈవోల దగ్గర పంట నమోదు చేసుకోవాలని ఏవో రవికుమార్ మండల ప్రజలని కోరుతున్నారు.